పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ పరాక్రమాలకు పెట్టింది పేరైన రొహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు. ప్రఖ్యాతి చెందిన అరబ్బులు, రొహిల్లాలు గల సైనిక దళానికి నాయకత్వం వహించిన తుర్రేబాజ్ ఖాన్, హైదరాబాద్ నివాసి పఠాన్ రుస్తుం ఖాన్ కుమారుడు. ఆయన బ్రిటీష్ సైన్యంలో చేరి ఔరంగాబాదు బ్రిటీష్ కంటోన్మెంటులో జమేదారుగా పనిచేశారు.